• Neti Charithra

వాచ్ మెన్ ను.. బెదిరించి.. లాకర్ ధ్వంసం చేసి.. మద్యం షాపులో రూ.7.52 లక్షలు చోరీ..!



వాచ్ మెన్ ను.. బెదిరించి.. లాకర్ ధ్వంసం చేసి.. మద్యం షాపులో రూ.7.52 లక్షలు చోరీ..!



తూర్పుగోదావరి: నేటి చరిత్ర


తూర్పుగోదావరి జిల్లాలో సెక్యూరిటీ గార్డును బెదిరించి, మద్యం దుకాణంలోని రూ.7.52 లక్షల నగదును చోరీ చేసిన ఘటన తొండంగి మండలం సుబ్బరాయపురంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల

కథనం మేరకు గ్రామంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో అమ్మకాల ద్వారా వచ్చిన సొమ్మును సిబ్బంది ఐరన్‌లాకర్‌లో ఉంచారు. ఈక్రమంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి అక్కడున్న సెక్యూరిటీ గార్డును బెదిరించి లాకర్‌లో

ఉన్న రూ.7.52 లక్షల నగదుతో పాటు రూ.3 వేలు విలువ చేసే మద్యాన్ని దొంగిలించారు. ఘటనా స్థలానికి ఎస్సై విద్యాసాగర్‌, డాగ్‌ స్క్వాడ్‌ చేరుకుని వివరాలు సేకరించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు


163 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon