• Neti Charithra

వికోట లో మళ్ళీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..!


వికోట లో మళ్ళీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..!




వి కోట: నేటి చరిత్ర



చిత్తూరు జిల్లా వి.కోట మండలంలో మరో ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.ఇప్పటికే 40 కేసులుండగా తాజా కేసులతో ఈ సంఖ్య 46కు చేరుకుంది.10 మంది ఐసోలేషన్లో ఉండగా 35 మంది కొలుకుని ఇంటికి చేరుకున్నారు. కారకుంటకు చెందిన 65 ఏళ్ళ వృద్దురాలు మృతి చెందింది.వి.కోట మండలం

యాదకుంటలో ఒకే కుటుంబం లో ముగ్గరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో వారిని ఆరోగ్య శాఖ వారు కోవిడ్ ఆసుపత్రికి తరలించారు.మండల పరిధిలోని చింతమాకులపల్లె కు చెందిన 60 ఏళ్ళ వృద్దురాలు చిత్తూరు లోని ఆసుపత్రికి ఆపరేషన్ కోసం వెళ్ళగా ఆమెకు పరీక్ష లో కరోనా పాజిటివ్‌గా తేలింది. అలాగే పట్రపల్లెకు చెందిన 53 వ్యక్తి కుప్పం కోవిడ్ ఆసుపత్రిలో పరీక్షించుకోగా అతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో అతను అక్కడే చికిత్స పొందుతున్నాడు.సంతగట్టుకు చెందిన

మరో యువకయడికి దగ్గు.. జలుబు ఉండటంతో అతను పరీక్షించుకోగా అతనికి పాజిటివ్‌ వచ్చుంది. ఇతను వి.కోట వ్యవసాయ మార్కెట్ లో విధులు నిర్వహిస్తున్నాడు. అతని ద్వారా మరెంత మందికి ఈ వైరస్ వ్యాప్తి చెందిందో అని అధికారులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు.


231 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon