• Neti Charithra

వికటించిన ప్రేమపెళ్లి.. నిప్పంటించుకున్న తల్లీ.. కుమార్తె మృతి..!


వికటించిన ప్రేమపెళ్లి.. నిప్పంటించుకున్న తల్లీ.. కుమార్తె మృతి..!




నేటి చరిత్ర:( ప్రత్యేక ప్రతినిథి)



ప్రేమ పెళ్లి వ్యవహారం ఓ ఇంట్లో ఇద్దరు మృతి కి కారణం ఆయిన ఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్‌ మండలం మొగిలిగిద్ద గ్రామానికి చెందిన స్రవంతి అదే గ్రామానికి చెందిన రాందాసు అనే

యువకుడు ప్రేమించుకుంటున్నారు. వారిని తల్లిదండ్రులు మందలించడంతో ఇటీవల గ్రామం నుంచి వెళ్లిపోయారు. పెద్దలు నచ్చచెప్పి వీరిని మళ్లీ గ్రామానికి తీసుకువచ్చారు. తర్వాత కూడా వీరిలో మార్పురాకపోవడంతో తల్లిదండ్రులు కుమార్తెను పలుమార్లు హెచ్చరించారు. ఈ విషయమై స్రవంతి (17), ఆమె తల్లి చంద్రకళ (35) తరచూ గొడవపడుతుండేవారు. ఈ నెల 15న తల్లీకూతురు మళ్లీ ఘర్షణ పడ్డారు. అదే సమయంలోనే చంద్రకళ భర్త పాండు ఇంటికి వచ్చీరాగానే స్రవంతిపై కిరోసిన్‌ పోయడానికి ప్రయత్నించాడు. పక్కనే ఉన్న చంద్రకళపై కూడా కిరోసిన్‌ పడింది. ప్రేమ వ్యవహారంపై కోపంతో ఉన్న చంద్రకళ.. కూతురుకు నిప్పంటించగా తనకు కూడా మంటలంటుకున్నాయి. దీంతో ఇద్దరూ తీవ్ర గాయాలపాలయ్యారు. చికిత్స నిమిత్తం వారిని స్థానికులు షాద్‌నగర్‌ ప్రభుత్వ

ఆసుపత్రికి, మెరుగైన చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించారు. ఉస్మానియా ఆసుపత్రిలో 4 రోజులుగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందారు. పాండుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టనున్నట్లు పట్టణ సిఐ శ్రీధర్‌కుమార్‌ తెలిపారు.


435 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon