• Neti Charithra

వరద బాధితులకు కాలం చెల్లిన వంట నూనె పంపిణి

#వరద బాధితులకు కాలం చెల్లిన వంట నూనె పంపిణి

గుంటూరు: నేటి చరిత్ర (ఆగస్టు24) గుంటూరు జిల్లాలో పౌరసరఫరా శాఖ అధికారుల నిర్లక్ష్యం వరద బాధితుల్లో ఆందోళన పెంచింది. కొల్లూరు మండలం లంక గ్రామాల్లోని వరదబాధితుల కోసం ప్రభుత్వం అందించిన నిత్యావసరాల్లో కాలం చెల్లిన పామాయిల్‌ నూనె ప్యాకెట్లను సరఫరా చేశారు. వరద ముంపుతో రోగాల బారిన పడిన తమకు.. కాలం చెల్లిన సరకులతో మరింత అనారోగ్యానికి గురి చేస్తున్నారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై మండిపడుతున్నారు. వరదలు వచ్చిన 5 రోజుల తర్వాత అధికారులు సాయం చేశారని, అందులోనూ ఇలాంటి కాలం చెల్లిన ఆహారపదార్థాలను పంపిణీ చేసి ఆరోగ్యంతో ఆడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon