• Neti Charithra

లో దుస్తుల్లో.. భారీగా పట్టు పడ్డ బంగారం.. పోలీసుల అదుపులో 11 మంది ..!


లో దుస్తుల్లో.. భారీగా పట్టు పడ్డ బంగారం.. పోలీసుల అదుపులో 11 మంది ..!





హైదరాబాదు: నేటి చరిత్ర



కరోనా కాలంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను లిమిటెడ్ గా మాత్రమే అనుమతి ఇస్తున్నారు.  వందే భారత్ మిషన్ లో భాగంగానే అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి.  అయితే, ఈ విమానాల ద్వారా కూడా కొంతమంది  బంగారాన్ని అక్రమంగా

రవాణ చేస్తున్నారు.  తాజాగా శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో భారీగా బంగారాన్ని  పట్టుకున్నారు.  వందే భారత్ మిషన్ విమానంలో దామన్ నుంచి వస్తున్న 11 మంది ప్రయాణికులు బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు.  

ఈ ప్రయాణికులు బంగారాన్ని వారి లో దుస్తుల్లో పెట్టుకొని తీసుకొస్తుండగా, కష్టమ్స్ అధికారుల చెకింగ్ లో ఇది బయటపడింది.  మొత్తం 3.11 కేజీల బంగారాన్ని వీరి నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  దీని విలువ కోటి ఆరు లక్షల రూపాయలు ఉంటుందని కష్టమ్స్ అధికారులు చెప్తున్నారు.  


297 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon