• Neti Charithra

లాక్ డౌన్ సమస్యల పై 16 న మదనపల్లె లో నిరసనలు- సీపీఎం


లాక్ డౌన్ సమస్యల పై 16 న మదనపల్లె లో నిరసనలు- సీపీఎం


( మదనపల్లె మీడియాతో మాట్లాడుతున్న సీపీఎం నాయకులు)


మదనపల్లె: నేటి చరిత్ర


కరోనా నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతూ ఏడు ప్రధాన డిమాండ్లతో ఆందోళనలు చేపట్టనున్నట్లు సిపిఎం మదనపల్లె కార్యదర్శి పి.శ్రీనివాసులు తెలిపారు. స్థానిక సిపిఎం కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థ కుప్పకూలడంతో గతంలో

ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ఉపాధి పోయి, నిరుద్యోగం పెరిగిందని అన్నారు. కరోనా ప్రభావిత దేశాల్లో భారతదేశం 4 వ స్థానంలో ఉందని గుర్తుచేశారు. కేంద్రం విడుదల చేసిన 20 లక్షల కోట్ల రూపాయలతో ప్రజలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదన్నారు. లాక్ డౌన్ లో ఇబ్బందులకు గురవుతున్న వలస, వ్యవసాయ, ఇతర కార్మికులను, ప్రజానీకాన్ని ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు 16 న గ్రామ, వార్డు

సచివాలయాల ఎదుట కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆందోళనలు చేస్తున్నామని తెలిపారు. సిపిఎం దేశవ్యాప్తంగా ఇచ్చిన ఈ పిలుపును అన్ని వర్గాల ప్రజలు , కార్మికులు, పార్టీ కార్యకర్తలు జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు .


డిమాండ్లు :

1. ప్రతి కుటుంబానికి కేంద్ర రూ .7,500 ఆరు నెలలు ఇవ్వాలి .

2. ఒక్కో వ్యక్తికి 10 కేజీల బియ్యాన్ని 6 నెలలు పంపిణీ చేయాలి .

3. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ప్రకటించాలి .

4. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనులను 200 రోజులు కల్పించాలి .

5. పట్టణాల్లో ఉపాధి భరోసా కార్యక్రమాలు చేపట్టాలి .

6. సవరించిన కార్మిక చట్టాలను పునరుద్ధ రించాలి , పాత వాటినే అమలు చేయాలి .

7. ప్రైవేటీకరణ విధానాలను ఉపసంహరించుకోవాలి .


ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి.హరీంద్రనాథ్ శర్మ, పి.నాగరాజు, బి.శివ, చలపతి తదితరులు పాల్గొన్నారు.

224 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon