• Neti Charithra

లాక్ డౌన్ శ్రామికులు ఆశా కార్యకర్తల కు సేఫ్టీ కిట్లు పంపిణీ చేయాలి- సీపీఐ డిమాండ్!


లాక్ డౌన్ శ్రామికులు ఆశా కార్యకర్తల కు సేఫ్టీ కిట్లు పంపిణీ చేయాలి- సీపీఐ డిమాండ్!



మదనపల్లె: నేటి చరిత్ర



చిత్తూరుజిల్లా మదనపల్లి మున్సిపాలిటీ,రూరల్ పరిదిలో పనిచేస్తున్న ఆశా కార్యకర్తలకు తక్షణమే సేప్టీ కిట్లు ఇవ్వాలని ఏఐటీయూసి జిల్లా సహయ కార్యదర్శి సాంబశివ ,మదనపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు ముబారక్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఏఐటీయూసి మదనపల్లి పట్టణ ముఖ్యుల సమావేశం ఏఐటీయూసి కార్యాలయంలో జరిగింది.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లి పట్టణ,రూరల్ పరిదిలో కరోనా కేసులు బయట పడుతున్న సందర్భంగా ఆశా కార్యకర్తలు రెడ్ జోన్ ఏరియాలో సర్వే చేస్తున్న ఆశా కార్యకర్తలకు ఎలాంటి సేప్టీ లేదన్నారు.డాక్టర్లు, ఇతర సెక్షన్ల అధికారులు ఎన్ 95 మాస్కులు, వేసుకొని వారి రక్షణ చూసుకుంటున్నారు కానీ ఆశా కార్యకర్తల ఆరోగ్యం గురించి పట్టించుకోలేదన్నారు.


తక్షణమే ఆశా కార్యకర్తలకు ఎన్ 95 మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు, లేని పక్షంలో మంగళవారం డిప్యూటీ డీఎం,అండ్ ఎచ్ఓ కార్యాలయం వద్ద ఏఐటీయూసి ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళనల చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు క్రిష్ణప్ప, వెంకటరమణ, రాజ్ కుమార్, బాలాజీ, తదితరులు పాల్గొన్నారు

48 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon