• Neti Charithra

లాక్ డౌన్ లోను .. పేదల..అపద్బాంధవుడు.. పిటిఎం "రియాసత్ అలీఖాన్' !


లాక్ డౌన్ లోను .. పేదల.. అపద్బాంధవుడు.."రియాసత్ అలీఖాన్"


పిటిఎం: నేటి చరిత్ర


చిత్తూరుజిల్లా పిటిఎం లో వైసీపీ నేత మాజీ సర్పంచ్ రియాసత్ ఆలీఖాన్ పేదలకు, పేద కూలీలు, వలస కూలీలకు విస్తృత సేవలు అందిస్తూ.. పేద ..మనసుల లో నిలుస్తున్నారు.




మాసం రోజులుగా ఆయన లాక్ డౌన్ లో సేవలు అందిస్తున్న వివిధ శాఖల సిబ్బందికి ఆపన్న హస్తం అందిస్తున్నారు. ముఖ్యంగా సచివాలయ సిబ్బందికి , పారిశుధ్య కార్మికులు విందు భోజనాలు పండ్లు ఫలాలు , మాస్కులు, అందిస్తున్నారు.



అలాగే

వలస కూలీలకు అన్నదానాలు.. నిత్యవసర వస్తువులు అందజేస్తుండగా గత వారం రోజులుగా జాతీయ ఉపాధి హామీ కూలీలు కు మాస్కులు పంపిణీ చేస్తూ.. వారికి ఆరోగ్య సలహాలు ఇస్తూ.. పలు రకాల పండ్లు ను పంపిణీ చేస్తున్నారు. గురువారం సుమారు 400 మంది ఉపాధి కూలీలు, పలు రేషన్ షాపుల వద్ద కార్డు దారులకు మాస్కులు, ద్రాక్ష పండ్లు, అరటి పండ్ల ను పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు.



కార్యక్రమంలో

పట్టాభి స్వామి, రిటైర్డ్ టీచర్ నాగరాజు, జయరామ శెట్టి, మాజీ డిటి నాగభూషణం,సూరి, బావజాన్,నారాయణ, ఫుజెల్, కుమార్, బాబు, ఫక్రుద్దీన్, గిరి, చలపతి రెడ్డి, దనిష్, సుహెల్,సమీర్ తదితరులు పాల్గొన్నారు.




183 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon