• Neti Charithra

లాక్ డౌన్ కు సహకరించక పోతే.. మదనపల్లె లో సంపూర్ణ లాక్ డౌన్- ఎమ్మెల్యే నవాజ్ బాషా..!


లాక్ డౌన్ కు సహకరించక పోతే.. మదనపల్లె లో సంపూర్ణ లాక్ డౌన్- ఎమ్మెల్యే నవాజ్ బాషా..!మదనపల్లె: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రజలు కరోనా కట్టడి కోసం అమలు చేస్తున్న లాక్ డౌన్ కు సహకరించక పోతే సంపూర్ణ లాక్ డౌన్ తప్పదని ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. మంగళవారం ఆయన

మదనపల్లె జిల్లా ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రి గా మార్చేందుకు జరుగుతున్న పనులు ను ఆసుపత్రి సూపరిండెంట్

డాక్టర్ రామమూర్తి నాయక్ తో కలసి పనులు పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పడమటి

మండలాల్లో కీలకం ఆయిన మదనపల్లె, తంబల్లపల్లె నియోజకవర్గాల్లో ఇటీవల కరోనా కేసుల సంఖ్య గణ నియంగా పెరుగుతున్నాయని దీని దృష్ట్యా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలు మేరకు

మదనపల్లి జిల్లా ఆసుపత్రిని కోవిడ్ ఆసుపత్రిగా మార్చేందుకు

గత శనివారం తిరుపతిలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు. సుమారు 75 పడకల తో కోవిడ్ ఆసుపత్రిగా మార్చడం జరుగుతుందన్నారు. ఇందులో సుమారు 13 మంది డాక్టర్లు, 25 మంది స్టాఫ్

నరుసులు,లాబ్ అసిస్టెంట్లు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ వారం లోగా అన్ని పనులు పూర్తిచేయాలని వచ్చే వారంలో కోవిడ్ ఆసుపత్రిని అందుబాటులో ఉండే

విదంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గత మూడు నెలల పాటు నియోజకవర్గంలో పాజిటివ్ కేసులు లేవని, జులై మాసం నుండి మదనపల్లి నియోజకవర్గం తో పాటు పక్కనున్న పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలలో ఎక్కువ పాజిటివ్ కేసులు రావడం జరిగిందని తెలిపారు. ప్రజలకు భయం ఏర్పడిందని ప్రజల భయాన్ని తొలగించుట కోసం మదనపల్లి జిల్లా ఆసుపత్రి ని కోవిడ్ ఆసుపత్రి గా మార్చి ప్రజల కు వెంటనే వైద్య సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి వైద్య సిబ్బంది తో పాటు ఎమ్మెల్యే గా నేను కూడా నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటానని తెలిపారు. మదనపల్లె పట్టణంలో ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు అన్ని షాపులు ఓపెన్ చేసుకునే విధంగా ఆదేశించడం జరిగిందని, 11 గంటల తర్వాత లాక్ డౌన్ అమలు చేస్తారని

అయితే వివిధ రకాల ప్రజా సంఘాలు, కులాలు, మతాలకు అతీతంగా ఉదయం 11 గంటల తర్వాత ప్రజలు మా స్కూలు ధరించకుండా సామాజిక దూరాన్ని పాటించకుండా బయట తిరుగుతున్నారని, పూర్తి గా లాక్ డౌన్ చేయాలని ఫేస్ బుక్,వాట్ షాప్ ద్వారా మైసైజ్ లు వస్తున్నాయని తెలిపారు. పూర్తిగా లాక్ డౌన్ చేయడం వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడతారని ఆలోచించి ఉదయం 11 గంటల తర్వాత లాక్ డౌన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను,మన ప్రాణాలు గురించి ఆలోచించే విధంగా ఎదుటి వారి ప్రాణాలు గురించి కూడా ఆలోచించాలన్నారు. ఇదే విధంగా పట్టణంలో పాజిటివ్ కేసులు పెరిగితే పూర్తిగా లాక్ డౌన్ చేయడం

జరుగుతుందని, పూర్తి లాక్డౌన్ కు ప్రజలందరూ కూడా సహకరించాలని తెలిపారు. ముందు వరుసలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నా వైద్య సిబ్బంది, మున్సిపల్ అధికారులు, కార్మికుల సిబ్బంది సేవలు మరువలేనివని ఆయన కొనియాడారు.


627 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon