• Neti Charithra

లాక్ డౌన్ కారణంగా ప్రముఖ నటుడు ఆత్మహత్య !


లాక్ డౌన్ కారణంగా ప్రముఖ నటుడు ఆత్మహత్య !






ముంబై: నేటి చరిత్ర



ప్ర‌ముఖ హిందీ బుల్లి తెర నటుడు, మన్మీత్ గ్రెవాల్(29) ఆత్మహత్య చేసుకున్నాడు.

నిరవధిక లాక్ డౌన్ తోషూటింగ్‌లు ఆగిపోవ‌డం, ఆర్థిక ఇబ్బందులు, మాన‌సిక ఒత్తిడి కార‌ణంగా మ‌న్మీత్ ఆత్మ‌హ‌త్య

చేసుకున్నట్టు సమాచారం.

మ‌న్మీత్ ముంబైలోని నవీ ముంబైలో ఉంటున్నాడు. ఇటీవల కుల్‌దీపక్ అనే టీవీ సీరియల్‌లో మన్మీత్ కనిపించాడు. ఢిల్లీకి చెందిన మ‌న్మీత్‌ వివాహం అనంత‌రం ముంబైకి వచ్చాడు.

మన్మీత్ తన భార్యతో కలిసి నవీ ముంబైలోని ఒక చిన్న ఫ్లాట్‌లో ఉంటున్నాడు.స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగ బుల్లితెర నటుడి ఆత్మహత్య సహా నటుల్లో విషాదాన్ని నింపింది.



254 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon