• Neti Charithra

లాక్ డౌన్ అమలు లో కేంద్రం విఫలం-మండి పడ్డ కాంగ్రెస్ !


లాక్ డౌన్ అమలు లో కేంద్రం విఫలం-మండి పడ్డ కాంగ్రెస్ !



పీలేరు: నేటి చరిత్ర


దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు లో కేంద్ర ప్రభుత్వం విఫలం అయ్యిందని పీసీసీ కార్యదర్శి చిత్తూరుజిల్లా పీలేరు నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జ్ అఘా మోహిద్దీన్ విమర్శించారు. గడి లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఆయన మీడియాతో

మాట్లాడుతూకేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద కూలీలకు 150 నుంచి 200 రోజుల పని దినాలు పెంచాలని డిమాండ్ చేశారు. పేదవారి అకౌంట్ లో కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛందంగా పదివేల రూపాయలు జమ చేయాలని, దాని వలన ఆర్థికంగా

చితికిపోయిన కుటుంబాలకు వెసలుబాటు కలుగుతుందని చెప్పారు. వలస కూలీలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా వారివారి స్వస్థలాలకు వెళ్ళుటకు తగిన సౌకర్యాలను భరించాలని , నిత్యవసర వస్తువుల ధరలు

విపరీతంగా పెరిగి సామాన్యుడు కొనలేని

పరిస్థితిలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, రైతులు పండించిన తమ పంటలను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి మార్కెటింగ్ చేసుకునే సౌకర్యం కల్పించాలని లేనిచో రైతులు నష్టపోతారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో లో పీలేరు మండల అధ్యక్షుడు మహబూబ్ బాషా ,డిసిసి సెక్రెటరీ శ్రీ వర్ధన్ చౌదరి,కాన్స్టెన్సీ మైనార్టీ ప్రెసిడెంట్ పటాన్ ఆదం, సాజిద్ తదితరులు పాల్గొన్నారు .

85 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon