• Neti Charithra

లాకప్ డెత్ కు కారకులు ఎవరు... చంపారా.. చనిపోయాడా !

#లాకప్ డెత్ కు కారకులు ఎవరు... చంపారా.. చనిపోయాడా !

గుంటూరు : నేటి చరిత్ర (సెప్టెంబర్11) గుంటూరు జిల్లా వినుకొండ పోలీస్‌ స్టేషన్లో లాకప్‌ డెత్‌ జరగటం తో ఉద్రిక్తత నెలకొంది. ఈ లాకప్ డెత్ కారణం విభిన్న కథనాలు వినిపిస్తోంది. పోలీసుల దెబ్బలకు.. మృతి చెందాడా.. లేక గ్రామస్తులు కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడా అనే విషయం పోలీస్‌ విచారణలో తేలాల్సి ఉంది. వివరాలు పరిశీలిస్తే.. వినుకొండ మండలం విట్టంరాజు పల్లి గ్రామానికి చెందిన పగడాల వేమారెడ్డి (60) అవివాహితుడు. గ్రామంలో (నిన్న) మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో అదే గ్రామానికి చెందిన 3 సంవత్సరాల పాపపై, వేమారెడ్డి అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలపై గ్రామస్తులు దాడి చేసి పోలీసులకు అప్పగించారని సమాచారం. ఆరోపణలు ఎదుర్కొంటున్న వేమారెడ్డి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో కోమాలోకి చేరిన వేమారెడ్డి ని వినుకొండ ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. అప్పటికే వేమారెడ్డి మరణించినట్లు సమాచారం. వేమారెడ్డి మరణానికి కారణం గ్రామస్తులా.. లేక లాకప్‌ డెత్‌ జరిగిందా.. అనే విషయం విచారణలో తేలనుంది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon