• Neti Charithra

లా..అండ్ ఆర్డర్ మరచి.. సివిల్ "సెటిల్ మెంట్లు " కు దిగిన సీఐ ను సస్పెండ్ చేసిన ఐజి..!


లా..అండ్ ఆర్డర్ మరచి.. సివిల్ "సెటిల్ మెంట్లు " కు దిగిన సీఐ ను సస్పెండ్ చేసిన ఐజి..!



నేటి చరిత్ర: ఒంగోలు


ఆయన లా అండ్ ఆర్డర్.. చూడాల్సిన పోలీస్ అధికారి.. కింది స్థాయి ఉద్యోగులకు దశా.. నిర్దేశం చేసి.. స్టేషన్ కు వచ్చే బాధితులకు.. నిజం.. చెప్పండి.. న్యాయం పొందండి.. అంటూ భరోసా కల్పించాల్సిన

పోలీస్ అధికారి... ఇవన్ని.. మరిచాడు.. స్టేషన్ లోనే పంచాయతీ లు పెట్టి.. సివిల్ సెటిల్ మెంట్లు.. ఆర్థిక లావాదేవీలు సెటిల్ చేసి.. డబ్బు బాగా సంపాదించు కోవాలను కున్నాడో.. ఏమో.. విషయం .. పై స్థాయి అధికారుల వరకు వెళ్ళింది. దింతో ఆ.. సీఐ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేసిన ఘటన ఒంగోలు లో చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సీఐ లక్ష్మణ్‌సివిల్ కేసులు, పంచాయితీలు చేస్తున్నారనే ఆరోపణలపై సీఐ లక్ష్మణ్‌పై జిల్లా ఎస్పీ సిద్ధార్ట్ కౌశల్ విచారణకు

ఆదేశించారు. ఆరోపణలపై ఒంగోలు డీఎస్పీ ప్రసాద్ విచారణ చేపట్టారు. విచారణ నివేదికతో పాటు ఎస్పీ సిఫారసు మేరకు సీఐ లక్ష్మణ్‌ను సస్పెండ్ చేస్తూ గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. పామూరు సీఐగా పనిచేస్తున్న శివరామకృష్ణారెడ్డిని ఒంగోలు తాలూకా సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.


545 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon