• Neti Charithra

రూ.80 కోట్ల తో రహదారులు..మౌలిక వసతుల కల్పన- మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా..!రూ.80 కోట్ల తో రహదారులు..మౌలిక వసతుల కల్పన- మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా..!
మదనపల్లె: నేటి చరిత్ర


(రోడ్డు పనులకు భూమి పూజ చేస్తున్న ఎమ్మెల్యే నవాజ్ బాషా)


చిత్తూరుజిల్లా మదనపల్లి నియోజకవర్గం లో రూ.80కోట్లు తో పెద్దఎత్తున అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. మంగళవారం ఆయన పలు గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన కు పలుచోట్ల వైసీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు.

మదనపల్లి రూరల్ మండలం, కొత్త వారి పల్లె పంచాయతీ, దుబ్బిగాని పల్లి గ్రామం నందు రూ.74 లక్షల తో 1200 మీటర్లు సిసి రోడ్డుకు , రెడ్డి వారి పల్లి గ్రామం నందు రూ. 45 లక్షల తో 750 మీటర్లు సిసి రోడ్లుకు, సి టి ఎం పంచాయతీ, చిన్నమ నాయన చెరువుపల్లి గ్రామం నందు రూ.1 కోటి 23 లక్షల తో 1950 మీటర్లు రోడ్ల


పనులకు భూమి పూజ చేశారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి మదనపల్లె పర్యటనకు వచ్చిన సందర్భంగా నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు సిసి ,బిటి రోడ్లు వేయడం తో పాటు అర్హులైన నిరుపేదలందరికీ గృహాలు నిర్మించి

ఇస్తామని చెప్పిన మాట ప్రకారంగా మదనపల్లె నియోజకవర్గ పరిదిలో రూ. 80 కోట్లతో అన్ని గ్రామాలకు సిసి,బిటి రోడ్లను నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. రూ.28 కోట్ల తో మదనపల్లె మండలం పరిధిలోని గ్రామాలకు సిసి,బిటి రోడ్లు పనులు జరుగుతున్నాయని రూ.52 కోట్లతో నిమ్మనపల్లె ,రామసముద్రం మండలాలలోని అన్ని గ్రామాలకు సిసి,బిటి రోడ్లు నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు నమ్మకం తో వైఎస్సార్ సి పి పార్టికి ఓట్లు వేసి గెలిపించినందుకు ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండి, ప్రజల సమస్యలను ఎప్పటి కప్పుడు పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికలకు ముందు మ్యానిఫెస్టో లో చెప్పిన నవరత్నాల పథకాల ద్వారా మొదటి సంవత్సరం లోనే 95 శాతం హామీలను నెరవేర్చిన ఘనత ఈ భారతదేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. కార్యక్రమాల్లో

సింగల్ విండో అద్యక్షులు కరుణాకర్ రెడ్డి, వై.ఎస్.ఆర్ పార్టీ నాయకులు ఉదయ కుమార్, శ్రీనివాసులు రెడ్డి, ఆనంద్ పార్థసారథి,వెలుగు చంద్ర, దావూద్ ఖాన్, గౌర మహేష్, నబీ, పాల్గొన్నారు.


231 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon