• Neti Charithra

రూ.250 కోట్ల బడ్జెట్ లో పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం !


రూ.250 కోట్ల బడ్జెట్ లో పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం !


హైదరాబాదు: నేటి చరిత్ర


తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక అభిమానులు కలిగిన నటుడు పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కోసం రూ. 250 కోట్ల బడ్జెట్ సినిమాకు పవన్ కళ్యాణ్ హీరోగా నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

పవన్ కళ్యాణ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మరియు త్రివిక్రమ్ లతో కూడా సినిమాలు ఓకె చేసాడనే ప్రచారం అయితే పవన్ ఫ్యాన్స్ కి కంటి మీద కునుకు రానియ్యడం లేదు. ఎప్పుడూ ఆచితూచి సినిమాలు చేసే పవన్ ఇలా రెండుమూడేళ్ళకి ఐదు సినిమాలంటే మాములు విషయం కాదంటున్నారు. మరి పవన్ క్లారిటీ ఇవ్వకుండా సైలెంట్ గా సినిమాలు మీద సినిమాలు మొదలెడుతున్నాడు. పూరి తో ఇప్పటికే బద్రి, కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు సినిమాలు చేసి ఉన్నాడు పవన్ కళ్యాణ్.

అయితే పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా మూవీ ని చక్కబెట్టిన తర్వాత పవన్ కోసం పూర్తి కథని సిద్ధం చేస్తాడని…. పవన్ కి ఇప్పటికే ఓ లైన్ చెప్పి ఒప్పించడం జరిగింది అంటున్నారు. అయితే పూరి స్టోరీ లైన్ ప్రకారం పవర్ స్టార్‌ను పవర్ ఫుల్ ముఖ్యమంత్రిగా చూపించడానికి పూరి జగన్నాధ్ ప్లాన్ చేస్తున్నాడట. అసలు పవన్ కి సీఎం కేరెక్టర్ అనగానే పూరి సినిమా ఓకె చేసాడని అంటున్నారు. ఎందుకంటే ఇలాంటి పవర్ ఫుల్ పొలిటికల్ కథలను టచ్ చేస్తే తన రాజకీయ జీవితానికి బావుంటుంది అని పూరి సినిమా లైన్ చెప్పగానే పూర్తి స్క్రిప్ట్ ప్రిపేర్ చెయ్యి సినిమా చేద్దామని మాటిచ్చాడంటున్నారు. పవన్ కళ్యాణ్ భవిష్యత్ రాజకీయ ఎత్తుగడలకు ప్రయోజనకరంగా ఉంటుందని.. అంతేకాకుండా ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ త్రిభాషా చిత్రానికి పూరి 250 కోట్ల బడ్జెట్‌ను ప్రతిపాదించినట్లు చెబుతున్నారు

ఇది ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ని సినీ పరిశ్రమ లో హాట్ టాపిక్ గా మారుతోంది.




78 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon