• Neti Charithra

రూ.1500 కోట్ల నగదు ఫై కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ పాలక మండలి!!

#రూ.1500 కోట్ల నగదు ఫై కీలక నిర్ణయం తీసుకున్న టీటీడీ పాలక మండలి!

తిరుమల: నేటి చరిత్ర (నవంబర్19) టిటిడి పాలకమండలి కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సొమ్మును ఇకపై జాతీయ బ్యాంకుల్లోనే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయాలని నిర్ణయించింది. ప్రాంతీయ బ్యాంకుల్లో భద్రత లేని కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు త్వరలోనే రూ.1500 కోట్లు జాతీయ బ్యాంకులో డిపాజిట్‌ చేయాలని నిర్ణయించింది. అయితే గత ప్రభుత్వంలో టిటిడి సొమ్మును ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడంతో పలువురు భక్తులు కోర్టును ఆశ్రయించారు. రూ.1400 కోట్లను ప్రైవేటు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేయడంతో భక్తులు అభ్యంతరం తెలుపుతూ.. హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కోర్టు సూచనల మేరకు జాతీయ బ్యాంకుల్లోనే డిపాజిట్లు చేయాలని తెలిపింది. కాగా కానుకల రూపంలో టిటిడి కి ప్రతి ఏడాది పెద్ద ఎత్తను విరాళాలు అందుతున్న నేపథ్యంలో.. వీటి భద్రతను దఅష్టిలో ఉంచుకుని ప్రాతీయ, ప్రైవేటు బ్యాంకుల్లో ఇక మీదట డిపాజిట్‌ చేయకూడదని పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon