• Neti Charithra

రూ. 10 లక్షలు.. డిమాండ్ చేసి ఏసీబీ కి చిక్కిన అధికారి !

#రూ. 10 లక్షలు.. డిమాండ్ చేసి ఏసీబీ కి చిక్కిన అధికారి !

పాల్వంచ : నేటి చరిత్ర (అక్టోబర్10) తెలంగాణా రాష్ట్రం ఖమ్మం జిల్లా కెటిపిఎస్ సిఇ కె. ఆనందం గురువారం ఎసిబి అధికారుల‌కు చిక్కారు. అనిశా అధికారులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం..కెటిపిఎస్ 5,6 ద‌శ‌ల‌కు సంబంధించి ల‌లితా మోహ‌న్ అనే గుత్తేదారు ప‌నులు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో రూ.71 ల‌క్ష‌ల‌కు బిల్లులు రావాల్సి ఉండ‌గా వాటిని విడుద‌ల చేసేందుకు సిఇ రూ.10 ల‌క్ష‌లు లంచం డిమాండ్ చేయ‌డంతో ల‌లితామోహ‌న్ రూ.2 ల‌క్ష‌లు ముట్ట‌జెప్పాడు. మిగిలిన డ‌బ్బుకోసం సిఇ వేధిస్తుండ‌టంతో ఆయ‌న అనిశా అధికారుల‌ను ఆశ్ర‌యించాడు. స్పందించిన అధికారులు ప‌క్కా ప్ర‌ణాళిక‌తో గుత్తేదారు ల‌లితామోహ‌న్‌తో క‌లిసి సిఇ ఆనందం కార్యాల‌యానికి వెళ్లారు. ల‌లితామోహ‌న్ ఆనందంకు డ‌బ్బులు ఇస్తుండ‌గా వ‌ల‌ప‌న్ని రెడ్‌హ్యాండెడ్‌గా ప‌ట్టుకున్నారు. ఈ దాడుల్లో అనిశా డిఎస్పీ ప్ర‌తాప్‌, సిఐలు ర‌మ‌ణ‌మూర్తి, ర‌వీందర్, క్రాంతి పాల్గొన్నారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon