- Neti Charithra
రాష్ట్ర స్థాయి ఖోఖో కు వి కోట విద్యార్థుల ఎంపిక

నేటి చరిత్ర: (డిసెంబర్19) అండర్-17 విభాగంలో రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు చిత్తూరు జిల్లా వికోట మండలానికి చెందిన పాముగానిపల్లె 10 వ తరగతి విద్యార్థులు ఎంపికయ్యారు.చౌడేపల్లె ఉన్నత పాఠశాలలో 18 తేదీన జరిగిన పోటీల్లో ఉత్తమ ప్రతిభ చాటడంతో బాలికల విభాగంలో టి.లలిత కుమారి, బాలల విభావంలో జి.అనిల్ కుమార్ ఎంపికైనట్లు పాఠశాల ప్రదనోపాధ్యాయిని చాముందేశ్వరి తెలిపారు.ఈ నెల 20 నుంచి గుంటూరులో జరగబోవు రాష్ట్ర స్థాయి పోటీల్లో చిత్తూరు జట్టు తరపున వీరు ప్రాతినిథ్యం వహించనున్నారు.విద్యార్థులతో పాటు ఎంపికయ్యేలా శిక్షణ ఇచ్చిన పి.డి సురేష్ ను అభినందిచారు.
20 views0 comments