• Neti Charithra

రాష్ట్రంలో కోవిడ్‌కు 8 వేల మంది బలి



  • కొత్తగా 19412 మందికి పాజిటివ్‌

  • మరో 61 మంది మృతి

అమరావతి, May 2: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విధ్వంసం ఉదృత మవుతోంది. రోజురోజుకి వైరస్‌ బారినపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరగుతోంది. కోవిడ్‌తో చనిపోతున్న వారి సంఖ్య సైతం పెరుగుతోంది. శనివారం నాటికి గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 98,214 పరీక్షలు నిర్వహించగా 19,412 కొత్త కేసులు పాజిటివ్‌గా తేలాయి. 61 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కోవిడ్‌తో మరణించిన వారి సంఖ్య 8 వేల మార్క్‌ దాటింది. రాష్ట్రంలో ఇప్పటిదాకా 1,64,88,574 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించగా ఇందులో 11,21,102 మంది వైరస్‌ బారినపడ్డారు. కొవిడ్‌తో విజయనగరంలో 8 మంది మృతి చెందారు. విశాఖ, చిత్తూరు, తూర్పు గోదావరిలో ఏడుగురు చొప్పున, అనంతపురంలో ఆరుగురు ఆరుగురు చనిపోయారు. ప్రకాశం, కర్నూలు, కష్ణా జిల్లాల్లో ఐదుగురు చొప్పున, నెల్లూరులో నలుగురు, గుంటూరు, కడప, శ్రీకాకుళంలో ఇద్దరు చొప్పున, పశ్చిమ గోదావరిలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మతుల సంఖ్య ఇప్పటిదాక 8,053కి చేరింది. 24 గంటల వ్యవధిలో 11,579 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,82,297కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.


నేటి చరిత్ర వాట్సాప్ గ్రూపులో లేరా...


నేటి చరిత్ర - గంట గంటకు న్యూస్ updates మీ whatsapp కే పొందలా..

JOIN WITH BELOW LINK.. Click here

https://chat.whatsapp.com/FE2bKwWpTKFCAXPph3gita


Share with your friends and invite them to join in WhatsApp group to get News updates in WhatsApp.