• Neti Charithra

రెవిన్యూ అధికారులపై మరో.."పెట్రోల్" దాడి!!

#రెవిన్యూ అధికారులపై మరో.."పెట్రోల్" దాడి!

వరంగల్: నేటి చరిత్ర (నవంబర్19) తెలంగాణా లో తహసీల్దార్‌ విజయారెడ్డిపై జరిగిన హత్యోదంతాన్ని మరవకముందే.. అదే తరహాలో మరో ఘటన రెవిన్యూ అధికారుల్లో దడ పుట్టించింది. కరీంనగర్‌ జిల్లా చిగురుమామిడి మండల తహసీల్దార్‌ కార్యాలయ సిబ్బందిపై కనకయ్య అనే రైతు పెట్రోలు చల్లాడు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని లంబాడిపల్లి గ్రామానికి చెందిన కనకయ్య తన భూమికి పట్టా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను తహసీల్దార్‌ కార్యాలయంలోని కంప్యూటర్లు, సీనియర్‌ సహాయకులు రామచంద్రంపై చల్లి నిప్పంటించబోయాడు. వెంటనే తేరుకున్న సిబ్బంది అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, కనకయ్య అన్నదమ్ముల మధ్య భూవివాదం ఉండటంతో అతనికి పాసు పుస్తకాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని, ఆ కేసు ప్రస్తుతం విచారణ జరుగుతోందని రెవెన్యూ సిబ్బంది తెలిపారు. విషయం తెలుసుకున్న జాయింట్‌ కలెక్టర్‌ శ్యామ్‌ ప్రసాద్‌లాల్‌ సమాచారాన్ని కలెక్టర్‌ సర్పరాజ్‌ అహ్మద్‌ దృష్టికి తీసుకెళ్లారు. పెట్రోలు చల్లిన రైతుపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని, క్రిమినల్‌ కేసు నమోదయ్యేలా చూడాలని కలెక్టర్‌ ఆదేశించారు

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon