• Neti Charithra

రైల్వే పట్టాల పై 4 మృత దేహాలు!

#రైల్వే పట్టాల పై 4 మృత దేహాలు!

హిందూపురం: నేటి చరిత్ర (అక్టోబర్15) అనంతపురం జిల్లా హిందూపురం మండలంలోని రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో 4 మృతదేహాలు లభ్యమవటం కల కలం రేపుతోంది. మొత్తం 3 చోట్ల రైల్వే ట్రాక్ లపై 4 మృతదేహాలను గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కిటిపి వద్ద రెండు, ములుగూరు వద్ద ఒకటి, దేవరపల్లి వద్ద మరో మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలికి బయల్దేరి వెళ్లారు. వీరంతా ఆత్మహత్య చేసుకున్నారా? లేదా వేరే ప్రాంతంలో ఎవరైనా చంపి ఇక్కడికి తీసుకొచ్చి ట్రాక్‌పై పడేశారా? అన్న కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హిందూపురం రైల్వే ఎస్సై బాలాజీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon