• Neti Charithra

రైలు పట్టాలు ..దాటుతుండగా కారును ఢీకొన్న రైలింజన్.. ఒకరి మృతి.. కడప జిల్లా లో విషాదం !


రైలు పట్టాలు ..దాటుతుండగా కారును ఢీకొన్న రైలింజన్.. ఒకరి మృతి.. కడప జిల్లా లో విషాదం !



కడప: నేటి చరిత్ర


కడప జిల్లా లో రైలు పట్టాలు దాటుతున్న

కారును రైలు ఇంజన్ ఢీ కొనడంతో ఒకరు మృతి చెందారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఎర్రగుంట్ల మండలం వైకోడూరు దాటిన తర్వాత భారతీ సిమెంట్స్‌కు వెళ్లే రైల్వే ట్రాకులో ఎల్సీ 3 వద్ద కారు రైల్వే లైనును దాటుతుండగా ట్రాక్‌పై మధ్యలోకి వచ్చి ఆగిపోయింది. అప్పుడే భారతీ సిమెంట్స్ నుంచి రెండు రైలింజన్లు వస్తున్నాయి. దీంతో  కారును రైలు 200 మీటర్ల దూరం లాక్కెళ్లింది. కేవలం 20 కిలోమీటర్ల స్పీడుతో రైలు రావడంతో కారు ట్రాక్ మీదే

ఆగిపోయింది. లేదంటే ఇంకా ఎక్కువగా దెబ్బతినేదని ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్ మేనేజన్ జాఫర్ హుస్సేన్ తెలిపారు. నాగిరెడ్డి, మరో వ్యక్తి.. ఇద్దరూ కారులో ఉన్నారని... సమీపంలోని ప్రొద్దుటూరు ఆస్పత్రి తీసుకెళ్తుండగా ఒకరు మృతి చెందినట్లు సమాచారం వచ్చిందని పేర్కొన్నారు.


157 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon