• Neti Charithra

రాయలసీమ జిల్లాలకు హంద్రీనీవా నీళ్లివ్వండి- సిపిఐ రామకృష్ణ

#రాయలసీమ జిల్లాలకు హంద్రీనీవా నీళ్లివ్వండి- సిపిఐ రామకృష్ణ

అమరావతి: నేటి చరిత్ర (ఆగస్టు24) హంద్రీనీవా కాలువ ద్వారా రాయలసీమ జిల్లాల్లోని చెరువులను నింపి రాయలసీమ ప్రజల దాహార్తిని తీర్చేందుకు చర్యలు చేపట్టాలని కోరుతూ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ సిఎంకు శనివారం ఓ లేఖ రాశారు. వర్షాలు లేక రాయలసీమలో చెరువులన్నీ ఎండిపోయాయని, పంట పొలాలు బీడులుగా మారాయని పేర్కొన్నారు. నీటి కొరత నానాటికీ తీవ్రమవుతోందని వివరించారు. అప్పులు తెచ్చి వేసిన పంటలు నీరందక ఎండిపోయాయని, రైతులు అప్పులెలా కట్టాలో తెలియక ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాయలసీమలో చెరువులున్న గ్రామాలకైనా హంద్రీనీవా ద్వారా ఎగువ నుండి వస్తున్న వరదనీటిని వదిలితే ప్రజలకు తాగునీరు, పశువులకు మేత దొరుకుతాయని వివరించారు. ఇలా చేయడం ద్వారా బోర్లలో నీటిమట్టం పెరిగే అవకాశం కూడా ఉంటుందని సూచించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon