• Neti Charithra

రైతు వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీ కి చిక్కిన వీఆర్వో..!


రైతు వద్ద రూ.20 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీ కి చిక్కిన వీఆర్వో..!




అనంతపురం: నేటి చరిత్ర


అనంతపురం జిల్లా లో మరో విఆర్వో

రైతు వద్ద పాస్ బుక్కు కోసం రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కాడు.

ఏసీబీ డీఏస్పీ అల్లాబకాష్‌ తెలిపిన వివరాల మేరకు.. చిత్రచేడు గ్రామానికి

చెందిన ఎల్లప్ప, ఆదినారాయణ అన్నదమ్ములు. వీరిద్దరికి భూమి భాగపరిష్కారం చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇవ్వాలని కోరుతూ వీఆర్వో సుధీర్‌ బాబును ఆశ్రయించారు. దీంతో వీఆర్వో రైతుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేయాలనుకున్నాడు. మొదట రూ.30 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేయగా.. అంత మొత్తం ఇవ్వలేమని రైతులు వేడుకున్నారు. చివరకు రూ.20 వేలు ఇవ్వాలని వీఆర్వో డిమాండ్‌ చేశాడు. దీంతో అన్నదమ్ములు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పథకం ప్రకారం సోమవారం

వీఆర్వోకి రైతులు నగదు ఇస్తుండగా దాడులు చేశామని డీఎస్పీ తెలిపారు. వీఆర్వోని అదుపులోకి తీసుకుని, అతని నుంచి నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డీఎఎస్పీతో పాటు ఈ దాడుల్లో ఏసీబీ సీఐ ప్రభాకర్‌, తదితరులు పాల్గొన్నారు


366 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon