• Neti Charithra

రైతులను ఆదుకోవాలని ములకలచేరువు లో రైతు సంఘం నేతల నిరసనలు..!


రైతులను ఆదుకోవాలని ములకలచేరువు లో రైతు సంఘం నేతల నిరసనలు..!
ములకలచేరువు: నేటి చరిత్ర


ఏపీ రైతుసంఘం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆందోళనల్లో భాగంగా చిత్తూరుజిల్లా ములకలచేరువు లో

గురువారం రైతు సంఘ నాయకులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట

ధర్నా నిర్వహించి తహసీల్దార్ కు మెమోరాండం అందజేశారు.

డిమాండ్స్:-

1.అధిక వర్షాలతో దెబ్బతిన్న ఆహార పంటలకు ఎకరాకు 25 వేల రూపాయలు, ఉద్యాన,వాణిజ్య పంటలకు 50 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి.

2.గత సంవత్సరము అధిక వర్షాలతో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం బకాయిలను వెంటనే చెల్లించాలి.

3.పంట నష్టము అంచనావేయడంలో వాస్తవసాగుదారులకు అన్యాయం జరగకుండా చూడాలి.కౌలురైతుకే పంట నష్టపరిహారం ఇవ్వాలి.

4.పంటనష్టపోయిన రైతులు,రైతు కౌలు రైతులు ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో తీసుకున్న పంట రుణాలు రద్దు చేయాలి. తిరిగి పంట రుణాలు ఇవ్వాలి. 5.ప్రత్యామ్నాయ పంటలు వేసుకునేందుకు అవసరమైన విత్తనాలు,ఎరువులు,పురుగు మందులు ఉచితంగా ఇవ్వాలి.

6.వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి,ఉచిత విద్యుత్తుకు మంగళంపాడే జీవో నెంబర్ 22ను ఉపసంహరించుకోవాలి.

7. కేంద్ర ప్రభుత్వం ఇటీవలతీసుకువచ్చిన రైతు వ్యతిరేక మూడు చట్టాలను రద్దు చేసుకోవాలి.

8.భారీ వర్షాలకు, వరదలకు,కోతలకు గురైన మరియు మేట వేసిన పంట భూములను ఉపాధి హామీ పథకం ద్వారా బాగు చేయాలి. తెగిపోయిన చెరువులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేయాలి.

9.పడమటి మండలాలలో నష్టపోయిన వేరుశెనగ పంట రైతులకు ఎకరాకు 25 వేలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలి.

ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గపు కార్యదర్శి యస్.మనోహర్ రెడ్డి,రైతుసంఘం అధ్యక్ష,కార్యదర్శి లు కే.అంజనప్ప, యస్.వేకటరమణ,మండల నాయకులు పీ.భాస్కర,పీ.రఘు,ఉతన్న,జయాకర్,వెంకటస్వామి,కె. రాజన్న,బి.వెంకటరమణ,వీ.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.


80 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon