• Neti Charithra

రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగించాలని మదనపల్లె లో నిరసనలు..!


రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగించాలని మదనపల్లె లో నిరసనలు..!





మదనపల్లె: నేటి చరిత్ర

రైతుల మోటర్లకు మీటర్లు పెట్టే నిర్ణయాన్ని రద్దుచేసుకోవాలని ఉచిత విద్యుత్తు కొనసాగించాలని, నగదు బదిలీ జీఓ 22 ను రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ మదనపల్లె లోప్రజా సంఘాల ఆధ్వర్యములో నిరసన ధర్నా నిర్వహించారు. మదనపల్లె సబ్

కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాలో రైతు సంఘం నాయకులు నరశింహులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.శ్రీనివాసులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి.హరీంద్రనాథ్ లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యుత్ సంస్కరణలకు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం రైతులపై భారాలు వేస్తున్నదని అన్నారు. రైతులకు అమలు అవుతున్న ఉచిత విద్యుత్ పథకాన్ని నీరు కార్చటానికి ప్రభుత్వం పన్నిన కుట్రే విద్యుత్ నగదు బదిలీ పథకం పేరుతో చేసిన జి వొ నంబెర్ 22 అని అన్నారు. ప్రస్తుతం రైతులు వాడుకున్న విద్యుత్ బిల్లులను నేరుగా ప్రభుత్వమే డిస్కములకు చెల్లిస్తూ ఉన్నదని, దాని స్థానంలో మోటార్లకు మీటర్లు బిగించి వాడుకున్న మొత్తానికి సమానమైన డబ్బును ప్రభుత్వం రైతుల ఖాతాలో జమచేయడం అంటే క్రమంగా రైతులను ఉచిత విద్యుత్తుకు దూరం చేయడమే అన్నారు. ప్రపంచ బ్యాంకు సరళీకరణ విధానాలకు లొంగిపోయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదుబదిలీ తీసుకొస్తున్నాయని అన్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఒకసారి సాగునీటికి మీటర్లు బిగించి యూజర్ చార్జీలు వసూలు చేయాలని చూసి రైతుల ఆగ్రహానికి గురై పది సంవత్శరాలు ప్రతిపక్షంలో ఉన్న

విషయం మరిచిపోవద్దని హితవు పలికారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బేషరతుగా జి ఓ నంబర్ 22 ను రద్దు చేయాలని లేని పక్షంలో బషీర్ బాగ్ అమర వీరుల స్పూర్తితో విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేక పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రమణ, ఆదెన్న వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు పార్వతమ్మ, సిఐటియు నాయకులు ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


105 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon