• Neti Charithra

గొడ్డలితో నరికి రైతు దారుణ హత్య.. ములకలచేరువు లో కల కలం..!


గొడ్డలితో నరికి రైతు దారుణ హత్య.. ములకలచేరువు లో కల కలం..!

ములకలచేరువు: నేటి చరిత్ర


( కదిరినాథుని కోట లో దారుణ హత్యకు గురైన రైతు వెంకటరమణ)


(హత్యకు వినియోగించిన గొడ్డలి)చిత్తూరు జిల్లా ములకలచేరువు మండలంలో బుధవారం పట్టపగలు దారుణ హత్య చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ములకలచేరువు మండలం కదిరినాథుని కోట కు చెందిన రైతు డేగాని వెంకటరమణ అదే గ్రామానికి చెందిన

నారాయణ లు మంగళవారం పొలాల వద్ద గోడవపడ్డారు. ఈ నేపథ్యం లో బుధవారం మధ్యాహ్నం కదిరినాథుని కోట గ్రామం లో

పట్ట పగలు గ్రామస్తులు చూస్తుండగానే

డేగాని వెంకటరమణ ను ప్రత్యర్థులు మచ్చు గొడ్డలి తో మెడ పై నరికి

దారుణ హత్యకు పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న సీఐ సురేష్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి

మృత దేహాన్ని పోస్ట్ మార్టం కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి

కేసు దర్యాప్తు చేస్తున్నారు.2,054 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon