• Neti Charithra

రుణ మాఫీ జీవో ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం !

#రుణ మాఫీ జీవో ను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం !

అమరావతి : నేటి చరిత్ర (సెప్టెంబర్25) గత టిడిపి హయాంలో మంజూరు చేసిన రుణమాఫీ ఉత్తర్వులను ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య బుధవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఈ ఏడాది మార్చి 10 తేదీన జారీ చేసిన జీవో నెంబరు 38ని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీకి సంబంధించి 4-5 విడతల్లో ఇవ్వాల్సిన రూ.7959.12 కోట్ల ను నిలుపుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. 4, 5 విడతల్లో చెల్లించాల్సిన మొత్తంతో పాటు 10 శాతం వడ్డీ కలిపి 7959.12 కోట్లు పెండింగ్‌ ఉన్నాయి. రూ.7959.12 కోట్ల కు సంబంధించి జీవో నెంబరు 38ని గత ప్రభుత్వం జారీ చేసింది. జీఓ 38 ని రద్దు చేస్తూ.. తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వైఎస్‌ఆర్‌ రైతు భరోసా పథకం నేపథ్యంలో ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon