• Neti Charithra

రేణిగుంట విమానాశ్రయం లో అగ్నిమాక వాహనం బోల్తా.. ఆకాశం లో తేలాడిన విమానం..!


రేణిగుంట విమానాశ్రయం లో అగ్నిమాక వాహనం బోల్తా.. ఆకాశం లో తేలాడిన విమానం..!



రేణిగుంట: నేటి చరిత్ర


(రేణిగుంట విమానాశ్రయం లో బోల్తా పడ్డ అగ్నిమాపక వాహనం)


చిత్తూరు జిల్లా రేణిగుంట విమానాశ్రయంలో ఈరోజు ఉదయం హైదరాబాదు నుండి రేణిగుంట విమానాశ్రయానికి 8.20Am లకు రావలసిన ఇండిగో విమానం రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండింగ్ కాకుండా గగనతలంలోనే చక్కర్లు కొట్టి బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యింది ఇందులో40 మంది ప్రయాణికులు ఉన్నారు. వివరాల్లోకి వెళితే విమానాశ్రయంలో విమానాలు దిగే అర్ధగంట ముందు విమానాశ్రయ

సిబ్బంది,అగ్నిమాపక సిబ్బంది అగ్నిమాపక వాహనంతో రన్వే మొత్తాన్ని పరిశీలించిన తర్వాత విమానాలు ల్యాండింగ్ కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తారు.ఈ అగ్నిమాపక వాహనం సిబ్బందితో పరిశీలించే సమయములో రన్వే మీద అదుపుతప్పి అగ్నిమాపక వాహనము రన్వే మీద పడిపోవడంతో విమానాలు

దిగడానికి ఆస్కారం లేకుండా బెంగళూరుకు తిరుగు ప్రయాణం అయ్యింది ఇండిగో విమానం.ఈ విషయాన్ని తెలుసుకున్న విమానాశ్రయ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని వాటి మరమ్మతులు చేస్తున్నారు.


393 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon