• Neti Charithra

రౌడీ షీటర్ పై కాల్పులు.. జరిపిన సబ్ ఇన్స్ పెక్టర్ !


రౌడీ షీటర్ పై కాల్పులు.. జరిపిన సబ్ ఇన్స్ పెక్టర్ !







బెంగుళూరు: నేటి చరిత్ర


కర్ణాటక రాష్ట్రంలో లాక్ డౌన్ వేళ ఓ రౌడీ షీటర్ పై ఓ సబ్ ఇన్స్పెక్టర్ కాల్పులు జరపడం హాట్ టాపిక్ గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్రముఖ రౌడీషీటర్‌ మరియా దిలీప్‌ హత్య కేసుకు సంబంధం ఉన్న రౌడీషీటర్‌ ఆండ్య్రూ అలియాస్‌ సంజయ్‌(19)పై నగర కేజీహళ్లి పోలీసులు కాల్పులు జరిపి అరెస్టు చేశారు. బాగలూరు లేఔట్‌ లిడ్కర్‌ కాలనీలో నిందితుడు దాగి ఉన్నట్లు సమాచారం రావడంతో కేజీ హళ్లి ఇన్‌స్పెక్టర్‌ అజయ్‌సారథి సిబ్బందితో కలిసి సోమవారం ఉదయం ఆ ప్రదేశానికి వెళ్లారు. అరెస్టు చేసేందుకు ప్రయత్నించిన కానిస్టేబుల్‌ శ్రీనివాసమూర్తిపై అతడు కత్తితో దాడిచేయటంతో ఇన్‌స్పెక్టర్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌తో దుండగుడి కాళ్లపై కాల్పులు జరిపారు. దీంతో అక్కడికక్కడే కుప్పకూలిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. అతడు విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు డీసీపీ డాక్టర్‌ శరణప్ప ప్రకటించారు.





232 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon