• Neti Charithra

రౌడీషీటర్ ను గొంతుకోసి..దారుణ హత్య.. చిత్తూరు జిల్లా లో ఘటన..!



రౌడీషీటర్ ను గొంతుకోసి..దారుణ హత్య.. చిత్తూరు జిల్లా లో ఘటన..!




కుప్పం: నేటి చరిత్ర



(దారుణ హత్యకు గురైన మునికృష్ణ)


చిత్తూరు జిల్లా కుప్పం మండలం పై పాళ్యం లో ఓ రౌడీ షీటర్ మునికృష్ణ దారుణ హత్యకు కు గురయ్యాడు.అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో గొంతుకోసి దారుణంగా హతమార్చారు.తీవ్ర రక్తస్రావం కావడంతో సంఘటన స్థలంలోనే మృతిచెందాడు...పోలీసుల కథనం మేరకు..

చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాళ్యం

గ్రామానికి చెందిన మునికృష్ణ వివిధ కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు. అతనిపై రౌడీషీట్ కూడా నమోదయింది తరుచు దారికాచి ప్రజలను బెదిరించి డబ్బు నగలు దోచుకొనివెళ్ళేవాడు..తరచూ గా హెరామ శివారులోని ఇళ్ళను ఎంచుకుని దొంగతనాలకు పాల్పడేవాడు ..ఈ క్రమంలో వివిధ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదయ్యాయి..పైపాళ్యం గ్రామంలో తరచూ గొడవలు పడుతూ ప్రజలను భయభ్రాంతులకుగురిచేసేవాడు..ఈక్రమంలో నిన్న అర్ధరాత్రి తన పొలం వద్ద నిద్రిస్తున్న సమయంలో గుర్తుతెలియని దుండగులు కత్తులతో అత్యంత దారుణంగా హతమార్చారు...రక్తపు మడుగులో అక్కడిక్కడే

మృతిచెందాడు..గత కొంతకాలంగా మృతుడి చిన్నాన్న కుటుంబానికి పొలం తగధాలు నడుస్తున్నదని గ్రామస్థులు చెబుతున్నారు..ఈక్రమంలో హత్య జరిగిందా లేక వేరే ఎవరైనా హత్య చేశారా అనే విషయం విచారణలో తెలియాల్సింది. .హత్య జరిగిన తరువాత రౌడి షీటర్ చిన్నాన్న కుటుంభం మొత్తం కనిపించకుండా పోవడంతో వారిమీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు..విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.


1,153 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon