• Neti Charithra

రెండు యేళ్ళ పాపను చంపిన తల్లి తండ్రికి 20 యేళ్ళు జైలు శిక్ష!

#రెండు యేళ్ళ పాపను చంపిన తల్లి తండ్రికి 20 యేళ్ళు జైలు శిక్ష!

అమెరికా: నేటి చరిత్ర రెండు యేళ్ళ వయసున్న కన్న బిడ్డను దారుణ హత్య చేసిన కేసులో తండ్రి కి 14 ఏళ్ళు తల్లి కి 20 యేళ్ళు జైలు శిక్ష విధించిన ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటుచేసుకుంది. కన్న తల్లిదండ్రులే రెండేళ్ల చిన్నారిని అత్యంత కిరాతకంగా చంపేసి, మృతదేహాన్ని మాయం చేయడానికి యాసిడ్‌తో నింపిన డ్రమ్ములో ముంచేశారు. అనంతరం వారే తమ చిన్నారి కనిపించడం లేదంటూ పోలీసులను ఆశ్రయించారు. అయితే, పోలీసుల దర్యాప్తులో పేరెంట్సే చిన్నారిని హతమార్చడంతో పాటు శవాన్ని మాయం చేసినట్లు తేలింది. దీంతో ఈ దారుణానికి పాల్పడిన మోనికా డోమింగాజ్, గెరార్డో జవేలా లోరెడో దంపతులను అదుపులోకి తీసుకున్నారు. తాజాగా ఈ కేసు విచారణకు రావడంతో న్యాయస్థానం ఈ జంటకు శిక్షను ఖరారు చేసింది. వివరాల్లోకి వెళితే... టెక్సాస్‌లో ఉండే గెరార్డో జవేలా లోరెడో(32), మోనికా డోమింగాజ్(38) దంపతులకు రెండేళ్ల కూతురు రెబెకా జవాలా ఉంది. అయితే, ఫిబ్రవరిలో రెబెకాను చంపేసిన ఈ జంట చిన్నారి శవాన్ని మాయం చేసేందుకు యాసిడ్‌తో నింపిన డ్రమ్ములో ముంచేశారు. అనంతరం తమ కూతురు కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఈ దంపతులపై గతంలో కూడా పలుమార్లు చిన్నారిని హింసించినందుకు కేసులు నమోదయ్యాయి. అందుకే ఈ జంటను అనుమానించిన పోలీసులకు దర్యాప్తులో విస్తుగొలిపే నిజాలు తెలిశాయి. ఈ జంట నివాసముంటున్న ఇంటిని తనిఖీ చేసిన పోలీసులకు గదిలో మానవ అవశేషాలు దొరికాయి. దీంతో దంపతులను తమదైన శైలిలో పోలీసులు విచారించి నిజాలు కక్కించారు. విచారణలో తమ కుమార్తె రెబెకా స్నానం చేసే సమయంలో బాత్‌ టబ్‌లో మునిగి చనిపోయిందని చెప్పారు. దాంతో ఏం చేయాలో తోచకపోవడంతో పాప మృతదేహాన్ని మాయం చేయడానికి డ్రమ్మును యాసిడ్‌తో నింపి దానిలో చిన్నారి శవాన్ని ముంచేసినట్లు తెలిపారు. ఈ దారుణ ఘటనపై న్యాయస్థానం విచారణ జరిపింది. విచారణలో ఈ దంపతులు తమ నేరాన్ని అంగీకరించారు. దీంతో కోర్టు తల్లి మోనికా డోమింగాజ్‌కు 20 ఏళ్లు, తండ్రి గెరార్డో జవేలా లోరెడోకు 14 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon