• Neti Charithra

రెండు మినీ బస్సు లు ఢీ: 11 మంది మృతి

#రెండు మినీ బస్సు లు ఢీ: 11 మంది మృతి

జైపూర్‌: నేటి చరిత్ర (నవంబర్23) రాజస్థాన్‌లో ని జైపూర్ సమీప లో శనివారం ఉదయం రెండు మినీ బస్సు లు ఢీ కొనటం తో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం వేకువజామున 3గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నాగోర్‌ జిల్లాలోని కుచామన్‌ పట్టణ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon