• Neti Charithra

రోడ్డు ఎక్కిన జూనియర్ డాక్టర్ లు.. న్యాయం కోసం కొనసాగుతున్న ఆందోళనలు!


హైదరాబాద్: నేటి చరిత్ర


హైదరాబాదు లో జూనియర్ లు రెండవ రోజు రోడ్డు ఎక్కారు. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రిలో జూనియర్‌ వైద్యుల (జూడాలు) ధర్నా కొనసాగుతోంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా వ్యక్తి మృతిచెందాడంటూ గాంధీ ఆసుపత్రిలోని జూనియర్‌ వైద్యుడిపై

మంగళవారం మృతుడి బంధువులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిని నిరసిస్తూ నిన్న రాత్రి ఆస్పత్రి ముందు జూడాలు బైఠాయించారు. నిన్న రాత్రి 8.30 గంటల నుంచి 300 మంది జూనియర్‌ వైద్యులు విధులు బహిష్కరించి ధర్నాకు దిగారు.ఈ ఘటనకు సంబంధించి

పలువురు జూనియర్‌ డాక్టర్ లు

ఇప్పటికే మంత్రి ఈటలను కలిశారు. విధుల్లో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్‌ చేశారు. ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా కొవిడ్‌ పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

జూనియర్‌ వైద్యుడిపై దాడికి సంబంధించి చిలకలగూడ పోలీసులు ఇప్పటికే ఇద్దరిని అరెస్టు చేశారు.

50 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon