• Neti Charithra

రెడ్ జోన్ ఆంక్షలు.. తో మహిళ మృతి.. ఉద్రిక్తత!


రెడ్ జోన్ ఆంక్షలు.. తో మహిళ మృతి.. ఉద్రిక్తత!




కర్నూలు: నేటి చరిత్ర


కర్నూలు జిల్లా లో రెడ్ జోన్ ఆంక్షలు .. ఒకరి మృతికి కారణం కావటం తో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వివరాల లోకి వెళితే..

కర్నూలు పాతబస్తీలో మంగళవారం షేక్‌ నూజాత్‌(24) మృతి వివాదాస్పదంగా మారింది. ఉస్మానియా కళాళాల సమీప కాలనీలో నివాసం ఉండే నూజాత్‌

సాయంత్రం అకస్మాత్తుగా మూర్ఛతో కుప్పకూలి పడిపోయారు. పాతబస్తీ రెడ్‌జోన్‌ కావడం, దారులన్నీ మూసివేయడంతో పాత బస్టాండు వద్ద ఏర్పాటు చేసిన దారి మీదుగా ఆసుపత్రికి తరలించేలోగా ఆమె మృతి చెందారు. ఆసుపత్రికి ఆలస్యంగా తీసుకెళ్లడంతోనే ఆమె ప్రాణాలు

కోల్పోయిందని కుటుంబ సభ్యులు, పాతబస్తీ వాసులు పెద్దఎత్తున వడ్డెగేరి వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అత్యవసరం కోసం ఒక్కదారి కూడా లేకుండా అన్ని దారులు మూసివేస్తే ఎలా అని, ఇదేవిధంగా పలువురు ప్రాణాలు కోల్పోయారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దారికి అడ్డంగా ఉంచిన బారికేడ్‌లు తొలగించారు. స్వల్ప ఉద్రిక్తత నెలకొనడంతో డీఎస్పీ బాబాఫకృద్దీన్‌, సీఐలు మహేశ్వరరెడ్డి, దస్తగిరిబాబు అక్కడికి చేరుకున్నారు. ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఆందోళనకారులను శాంతింపజేశారు.

163 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon