• Neti Charithra

రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 40 మందికి తీవ్ర గాయాలు...

#రెండు ఆర్టీసీ బస్సులు ఢీ.. 40 మందికి తీవ్ర గాయాలు..

పశ్చిమ గోదావరి : నేటి చరిత్ర (సెప్టెంబర్16) పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు సమీపంలో కృష్ణ జిల్లా పరిధిలో రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. సోమవారం జరిగిన ఈ ప్రమాదంలో బస్సుల్లోని దాదాపు 40 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారందరినీ ముందుగా ప్రథమ చికిత్స కోసం ఆకివీడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుండి మెరుగైన వైద్యం కోసం ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon