• Neti Charithra

రెండన్నార..యేళ్ళ.. చిన్నారి ని ఎత్తు కెళ్ళి..ఆపై.. అత్యా చారం !

రెండున్నరేళ్ల వయసున్న బాలికపై పక్కింట్లోని వ్యక్తి అత్యాచారానికి ఒడిగట్టిన దారుణ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా చేసింది. స్థానికంగా నివసిస్తున్న నిందితుడు.. బాలికకు ఎరవేసి ఎత్తుకెల్లి ఆపై బలాత్కరించాడని అహ్మదాబాద్ క్రైంబ్రాంచ్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు(డీసీపీ) దీపన్ భాద్రన్ వెల్లడించారు. డిసెంబరు 28 నుంచి సదరు బాలిక కనబడకుండా పోయిందని, దీంతో ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారని సమాచారం. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

అయితే రెండ్రోజుల తర్వాత ఓ నిర్మానుష్య ప్రదేశంలో శరీరంపై గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్న బాలికను వారు గుర్తించారు. బాలికను వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ చిన్నారి పై అత్యాచారం జరిగినట్లు గుర్తించారు. చికిత్స అనంతరం బాలిక స్పృహలోకి రావడంతో అసలు విషయం బయటపడింది. తనను ఎత్తుకెళ్లింది పక్కింటి అంకులేనని బాలిక చెప్పడంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని కటకటాల వెనక్కు పంపారు.

56 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon