• Neti Charithra

రాజ్ భవన్ లో కరోనా.. కల కలం..84 మంది అధికారులకు ఆసుపత్రికి తరలింపు..!


రాజ్ భవన్ లో కరోనా.. కల కలం..84 మంది అధికారులకు ఆసుపత్రికి తరలింపు..!




నేటి చరిత్ర: (ప్రత్యేక ప్రతినిధి)



తమిళనాడులో కరోనా వైరస్‌ రోజురోజుకీ ఉద్ధృతమవుతోంది. తాజాగా రాష్ట్ర గవర్నర్‌ కార్యాలయం రాజ్‌భవన్‌లో మొత్తం 84మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. రాజ్‌భవన్‌లో కొందరికి వైరస్‌ లక్షణాలు కనిపించడంతో మొత్తం 147 మంది కరోనా నిర్థారణ పరీక్షలు

నిర్వహించారు. వీరిలో 84మందిలో వైరస్‌ బయటపడినట్లు రాజ్‌భవన్‌ ప్రకటించింది. అయితే కరోనా సోకినవారందరూ భవనం బయట విధులు నిర్వర్తించేవారేనని తెలిపింది. ప్రస్తుతం వైరస్‌ సోకిన వారందరూ క్వారంటైన్‌లో ఉన్నారని, వీరు గవర్నర్‌తో, సీనియర్‌ అధికారులతో కలవలేదని గవర్నర్‌ కార్యాలయం స్పష్టంచేసింది. వైరస్‌ సోకిన వారిలో ఎక్కువగా భద్రతా సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది ఉన్నట్లు పేర్కొంది. ముందుజాగ్రత్త చర్యగా రాజ్‌భవన్‌ కార్యాలయం ప్రాంగణంలో శానిటైజ్‌ పనులు చేపట్టారు.


169 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon