• Neti Charithra

'రిజైన్‌ మోడీ' పోస్టులు బ్లాక్‌..



  • బిజెపికి మద్దతుగా ఫేస్‌బుక్‌ తీరు

  • పొరపాటున తొలగించామంటూ వివరణ

  • బయటపెట్టిన విదేశీ మీడియా

న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వమే కారణమని, ప్రధాని మోడీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులను ఫేస్‌బుక్‌ బ్లాక్‌ చేయడం చర్చనీయాంశ మైంది. 'రిజైన్‌ మోడీ' హ్యాష్‌ట్యాగ్‌తో పెట్టిన ఈ పోస్టులు కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే బ్లాక్‌ చేయడం చూస్తుంటే సోషల్‌ మీడియా సంస్థలపై మోడీ ప్రభుత్వం ఎంతటి ఒత్తిడి తీసుకొచ్చిందో అర్థం చేసుకో వచ్చు. రిజైన్‌ మోడీ పోస్టులు బ్లాక్‌ చేయడాన్ని మన దేశంలో మీడియా పెద్దగా పట్టించుకోకపోయినా, అంతర్జా తీయ మీడియా సంస్థలు వెంటనే స్పందించడం విశేషం. రిజైన్‌మోడీ హ్యాష్‌ట్యాగ్‌ని బ్లాక్‌ చేసినట్టుగా మొట్టమొదట అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ బయటపెట్టడం గమనార్హం. మోడీ ప్రభు త్వానికి వ్యతిరేకంగా వచ్చిన సుమారు 12 వేల పోస్టులను ఫేస్‌బుక్‌ బ్లాక్‌ చేసిందని అమెరికాకే చెందిన ది గార్డియన్‌ పత్రిక పేర్కొంది. దేశంలో కరోనా విజృంభణకు కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యమే ప్రధాన కారణ మంటూ రిజైన్‌మోడీ హ్యాష్‌ ట్యాగ్‌తో ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సోషల్‌ మీడియాలో గత కొన్ని రోజు లుగా పోస్టులు వెల్లు వెత్తుతు న్నాయి. ఈ పోస్టులను కొన్ని గంటల సేపు ఆ సంస్థలు బ్లాక్‌ చేయడం మరింత వివాదంగా మారింది. ఖాతా దారులు స్వచ్ఛందంగా పోస్టులు పెడితే వాటిని సంస్థలు తొలగించడం అన్యాయమని నిపుణులు విమర్శిస్తున్నారు.

పొరపాటున పోస్టులు తొలగించాం : ఫేస్‌బుక్‌ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము ఈ పోస్టులను తొలగించలేదని, పొరపాటున జరిగిందని ఫేస్‌బుక్‌ వివరణ ఇచ్చింది. ''మేము తాత్కాలికంగా ఈ హ్యాష్‌ట్యాగ్‌ను బ్లాక్‌ చేశాము. ఇది మా పొరపాటే తప్ప కేంద్రం మాకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. పొరపాటు గుర్తించిన వెంటనే దానిని పునరుద్ధరించాం'' అని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి ప్రకటిం చారు. ఈ అంశంపై కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటి మంత్రిత్వ శాఖ కూడా స్పందించడం విశేషం. 'రిజైన్‌ మోడీ హ్యాష్‌ట్యాగ్‌ తొలగించాలని ప్రభుత్వం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. ఫేస్‌బుక్‌ పొరపాటున ఈ పోస్టులు తొలగించింది' అని కేంద్ర మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

పోస్టుల తొలగింపు ఇదే తొలిసారి కాదు బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెట్టే పోస్టులను తొలగించడం ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి సంస్థలకు కొత్త కాదు. దేశవ్యాప్తంగా ఉధృతంగా సాగుతున్న రైతు ఉద్యమ వార్తలనూ ఈ సంస్థలు బ్లాక్‌ చేస్తున్నాయి. రైతు ఉద్యమ నేతల ఖాతాలను తొలగిస్తున్నాయి. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలువురు ప్రముఖులు చేసిన ట్వీట్లుసహా వంద ట్వీట్లను తొలగించాలని ట్విట్టర్‌ను ఇటీవల కేంద్రం ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో, ట్విట్టర్‌ వాటిని తొలగించింది. ప్రజల భావప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.