• Neti Charithra

రాజధాని లో కూలిన భారీ భవనం.. నలుగురు మృతి !

రాజధాని లో కూలిన భారీ భవనం.. నలుగురు మృతి !

ఢిల్లీ: నేటి చరిత్ర (జనవరి25)

దేశ రాజధానిన్యూఢిల్లీ నిర్మాణంలో ఉన్న ఓ భవనం కూలిపోవడంతో ఆ శిథిలాల కిందపడి నలుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు విద్యార్థులు శిథిలాల కింద తప్పిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలోని భజన్‌పుర ప్రాంతంలో ఈరోజు సాయంత్రం జరిగిందీ సంఘటన. నిర్మాణంలో ఉన్న భవనం కింద ఓ కోచింగ్ సెంటర్ నడుస్తోంది. అందుకే ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందుంతోందని, తదుపరి వివరాలు చికిత్స అనంతరం తెలియజేస్తామని వైద్యులు తెలిపారు.

79 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon