• Neti Charithra

రాజధాని రైతుల వెంట నడుస్తా - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ !

రాజధాని రైతుల వెంట నడుస్తా- జనసేన అధినేత పవన్ కళ్యాణ్!

అమరావతి: నేటి చరిత్ర (ఫిబ్రవరి15)

అమరావతి రాజధానిగా ఉంటుందని హామీ ఇవ్వలేను కానీ.. మీతో కలిసి పోరాడతానని మాట ఇస్తున్నానని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో పరిస్థితులు చూసి పెట్టుబడిదారులు వెనక్కి వెళ్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని విషయం రాష్ట్ర పరిధిలోనిదే..2014లో నిర్ణయం జరిగిపోయిందని తెలిపారు. ‘‘క్విడ్‌ ప్రో కో ఎలా చేస్తారో మీకు తెలుసు కదా. తప్పులు చేస్తే టీడీపీ నేతలను శిక్షించండి. బీజేపీ పెద్ద నేతలతో మాట్లాడాను. అమరావతికే వాళ్లు మద్దతిస్తున్నారు.

తాము చేసే పనులకు కేంద్రం మద్దతు ఉందని వైసీపీ అబద్ధాలు చెబుతోంది. వెనుకబడిన రాయలసీమకు హైకోర్టు ఇస్తే తప్పుబట్టబోము. విశాఖలో ఇల్లు అద్దెకు దొరికే పరిస్థితి లేదు’’ అని రాజధాని రైతులను ఉద్దేశించి పవన్ చెప్పారు.

4 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon