• Neti Charithra

రాజధాని మహిళల పట్ల.. దురుసు గా ప్రవర్తించిన పోలీసులు.. నడి రోడ్డు పై బైఠాయించిన టీడీపీ నేతలు!

విజయవాడ: నేటి చరిత్ర (జనవరి10)

అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొనసాగించాల‌ని డిమాండ్ చేస్తూ గ‌త కొన్ని రోజులుగా పోరుబాట ప‌ట్టిన రైతుల‌కు మ‌ద్ద‌తుగా మ‌హిళ‌లు చేప‌ట్టిన పాద‌యాత్ర ఉద్రిక్త‌త‌కు దారితీసింది. శుక్ర‌వారం విజ‌య‌వాడ పిడ‌బ్ల్యూడీ గ్రౌండ్స్ నుంచి బెంజి స‌ర్కిల్ వ‌ర‌కూ ర్యాలీగా వెళ్లిన మ‌హిళ‌ల‌ను పోలీసులు ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకొని అరెస్టు చేశారు. ఈ క్ర‌మంలో త‌మ‌పై పోలీసులు వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై మ‌హిళ‌లు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తాము చేసిన నేర‌మేంటో చెప్పాల‌ని ప్ర‌శ్నించారు. వ్య‌క్తిగ‌త ప‌నుల‌పై వెళ్లే వారిని సైతం అరెస్టు చేస్తున్నారంటూ మ‌హిళ‌లు అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు. అంత‌కు ముందు రాజ‌ధాని రైతుల పోరాటానికి మ‌ద్ద‌తుగా మ‌హిళ‌లు పాద‌యాత్ర నిర్వ‌హించేందుకు య‌త్నించారు. పోలీసులు ఆంక్ష‌లు విధించిన‌ప్ప‌టికీ మ‌హిళ‌లు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చి బంద‌రు రోడ్డుపై బైఠాయించారు. పాద‌యాత్ర‌కు అనుమ‌తిలేద‌ని పోలీసులు వారిని నిలువ‌రించారు. న‌ల్ల వ‌స్త్రాలను ధ‌రించిన మ‌హిళ‌లు అమ‌రావ‌తిలోనే రాజ‌ధాని కొన‌సాగించాలంటూ నినాదాలు చేశారు. ఈ క్ర‌మంలో పోలీసులు ఎక్కిడిక‌క్క‌డ మ‌హిళ‌ల‌ను అడ్డుకొని బ‌ల‌వంతంగా లాక్కెళ్లి ఆర్టీసి బ‌స్సులు, ఆటోల్లో త‌ర‌లించారు. మ‌హిళ‌ల ఆందోళ‌న‌ల‌తో విజ‌య‌వాడ‌లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్ప‌డింది.

ఈ ఘటన ను నిరసిస్తూ విజయవాడ ఎంపీ కేశినేని నాని, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర్ రావు తదితరులు శుక్రవారం రాత్రి నడి రోడ్డు ఫై నిరసన కు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.

55 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon