• Neti Charithra

రాజధాని  కేసులు వాదించే న్యాయవాది కి రూ.5 కోట్లు మంజూరు చేసిన ఏపీ ప్రభుత్వం!

అమరావతి: నేటి చరిత్ర (జనవరి22)

అమరావతి రాజధాని కేసులను వాదించేందుకు న్యాయవాది ఫీజులకు జగన్ సర్కార్ రూ. 5 కోట్లు మంజూరు చేస్తూ బుధవారం సంచలన నిర్ణయం తీసుకుంది. రాజధాని కోసం సుమారు 29 వేలు మంది రైతులు 32 వేలు ఎకరాల భూములు ప్రభుత్వానికి అప్ప జెప్పారు. ప్రస్తుతం పరిస్థితి విభిన్నంగా మారింది. ఈ నేపథ్యం లో ఇప్పటికే బాధిత రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నారు. భవి షత్తు లో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. దింతో

హైకోర్టులో రాజధాని కేసులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఈ కేసులు వాదించేందుకు మాజీ అటార్నీ జనరల్‌ ముకుల్‌ రోహత్గీని నియమించుకుంది. ఆయనకు ఫీజు కింద రూ.5 కోట్లు కేటాయిస్తూ ప్రణాళికా విభాగం ఉత్తర్వులు జారీచేసింది. అంతేకాకుండా అడ్వాన్స్‌గా ఆయనకు రూ.కోటి చెల్లించేందుకు అనుమతిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్‌, పోలీస్‌ యాక్ట్‌ 30 అమలు, మూడు రాజధానుల నిర్ణయం, సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణ తదితర అంశాలపై ఉన్నత న్యాయస్థానంలో నమోదైన కేసుల విచారణకు ప్రభుత్వం తరఫున వాదనలు విన్పించేందుకు రోహత్గీని నియమించారు. ఇకపై ఆయా కేసులన్నింటినీ రోహత్గీయే వాదించనున్నారు.

23 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon