• Neti Charithra

రాజధాని కౌలు రైతులకు ప్రభుత్వం తీపి కబురు!

#రాజధాని కౌలు రైతులకు ప్రభుత్వం తీపి కబురు!

అమ‌రావ‌తిః నేటి చరిత్ర (ఆగస్టు27) ఏపీ రాజధాని రైతుల కౌలు డబ్బుల విషయంలో ఏపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని ప్రాంత రైతులకు రావాల్సిన రూ.187.40 కోట్ల కౌలు నిధులను సర్కారు విడుదల చేసింది. తమ కౌలు డబ్బులు చెల్లించాలంటూ ఆందోళన చేస్తున్న రాజధాని రైతులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. కౌలు చెల్లింపు కోసం ఏర్పాట్లు చేయాలంటూ సీఆర్డీయే, పురపాలక శాఖలకు స్పష్టం చేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఏటా కౌలు రూపేణా జూన్ మొదటి వారంలో వారి ఖాతాల్లో నగదు జమ అయ్యేది. అయితే, ఆగస్టు ముగస్తున్నా కౌలు డబ్బులు విడుదల కాకపోవడంతో రైతులు కొన్నిరోజులుగా ఆందోళన కార్యక్రమాలకు దిగారు.

15 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon