• Neti Charithra

రాజధాని అమరావతి.. ఉన్నట్టా.. లేనట్టా!- జనసేన అధినేత పవన్ కళ్యాణ్

#రాజధాని అమరావతి.. ఉన్నట్టా.. లేనట్టా!- జనసేన అధినేత పవన్ కళ్యాణ్

మంగళగిరి: నేటి చరిత్ర (అక్టోబర్25) రాష్ట్రంలో ఇసుక కొరత సమస్యతో లక్షలాది మంది కార్మికులు పనుల్లేక బాధపడుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. వైకాపా ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వాలి గానీ ఉన్న ఉద్యోగాలను తీసేయకూడదని అన్నారు. అసలు అమరావతిలో రాజధాని కడతారా? లేదా? స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన్ను ఇసుక లారీ యజమానులు కలిసి తమ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సందర్భంగా మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో పవన్‌ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పనితీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇసుక సరఫరా పునరుద్ధరణ జరిగే వరకు పోరాటం చేస్తామన్నారు. ఇసుక లారీల యజమానులు తనను కలిసి బాధపడ్డారనీ.. ఇసుక రవాణా ఆగిపోయి అనేక ఇబ్బందులు పడుతున్నామని వాపోయారని వెల్లడించారు. ప్రభుత్వ విధానం వల్ల తమ కుటుంబాలు వీధిన పడ్డాయని ఆవేదన చెందుతున్నారని పవన్‌ తెలిపారు. ఇసుక కొరత ప్రభావం అన్ని వర్గాల ప్రజలపైనా ఉందన్నారు. భవన నిర్మాణ కార్మికులను ఆదుకొనేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని జనసేనాని స్పష్టంచేశారు. ప్రభుత్వ పరిపాలన తీరు చాలా బాధను కల్గిస్తోందన్నారు. ప్రజల సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇసుక ఆన్‌లైన్‌ బుకింగ్‌ అర్ధరాత్రి పూటే ఎందుకు? అని ప్రశ్నించారు.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon