• Neti Charithra

రక్తదానం.. చేయండి.. ప్రాణ దాతలు అవ్వండి!

#రక్తదానం.. చేయండి.. ప్రాణ దాతలు అవ్వండి!

మదనపల్లె: నేటి చరిత్ర(సెప్టెంబర్29) చిత్తూరు జిల్లా మదనపల్లె లో ప్రమాదాల నివారణ, ప్రమాదాల బారిన పడిన వారికి రక్తం అవసరంపై అవగాహన మరియు డెమో కార్యక్రమం హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఆదివారం బెంగుళూరు బస్టాండు నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ట్రాఫిక్ ఎస్ఐ సుభాన్ నాయక్ మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ నియమ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ హెల్మెట్ ధరించాలని కోరారు. కారు నడిపే వారు సీటు బెల్ట్ పెట్టుకుని వాహనాల నడపడం ఎంతో అవసరం అన్నారు. హెల్పింగ్ మైండ్స్ వ్వవస్ధాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ జాతీయ రక్తదాన దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రక్తదానం మరియు రోడ్డు ప్రమాదాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించామని,మన శరీరంలో అత్యంత విలువైన రక్తాన్ని రోడ్డు పైన కాకుండా బ్లడ్ బ్యాంక్స్ లో దానం చేసి ప్రాణదాతలుగా నిలవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు సునీల్,దినకర్,దేవా,పురుషోత్తం, రెడ్డి,శివ, ప్రవీణ్, పవన్,బావజన్,కార్తిక్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon