• Neti Charithra

యువకుని పై చిరుత పులి దాడి.. చిత్తూరు జిల్లా లో కల కలం..!


యువకుని పై చిరుత పులి దాడి.. చిత్తూరు జిల్లా లో కల కలం..!



తిరుపతి: నేటి చరిత్ర


(చిరుత దాడి లో గాయపడ్డ యువకుడు)


తిరుపతి నగర శివారుల లో చిరుత పులి ఓ యువకునిపై దాడి చేయడం కల కలం రేపుతోంఫై.చిత్తూరు జిల్లాలోని శేషాచల అడవుల్లో చిరుత హడలెత్తిస్తోంది. ఇటీవల  తిరుమల వెళ్తున్న వారిపై దాడి చేసిన చిరుత అర్ధరాత్రి అలిపిరి- చెర్లపల్లి

రహదారిపై వెళ్తున్న ద్విచక్రవాహనదారుడిపై దాడి చేసింది. చిరుత దాడి నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డ యువకుడు ఎమ్మార్‌పల్లి పోలీసులకు సమాచార మందించాడు. వెంటనే స్పందించిన

పోలీసులు యువకుడికి చికిత్స అందించి అతని ఇంటి వద్ద వదిలిపెట్టారు. నాలుగు నెలలుగా జనసంచారం తగ్గడంతో అటవీ జంతువులు రోడ్లపైకి వస్తున్నాయని, వాహనదారులు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.


594 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon