• Neti Charithra

మాస్కులు లేకుండా బయటికి రావడం నిషేధం- చిత్తూరు జిల్లా లో ప్రభుత్వ ఆంక్షలు!


మాస్కులు లేకుండా బయటికి రావడం నిషేధం- చిత్తూరు జిల్లా లో ప్రభుత్వ ఆంక్షలు!



చిత్తూరు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా లో మాస్కులు లేకుండా తిరిగే వారి పై కఠినంగా వ్యవహరించేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోంది. ముఖ్యంగా

ప్రజలందరూ బయటకు వచ్చే సమయంలో విధిగా మాస్క్ ను ధరించి రావాలని జిల్లా కలెక్టర్ డా. నారాయణ భరత్ గుప్తా మంగళవారం పేర్కొన్నారు.

కోవిడ్ – 19 కారణం గా జిల్లా ప్రజలందరూ స్వీయ నియంత్రణ పాటిస్తూ అవసరమైతే తప్ప ఇంటి నుండి బయటకు రావొద్దని, బయటకు వచ్చిన సమయంలో ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాలని, విధిగా మాస్క్ ను ధరించాలని, జిల్లాలో రోజు రోజుకూ కోవిడ్ – 19 పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యం లో ప్రజలందరూ తగు జాగ్రత్తలు తీసుకుంటూ కేసుల నియంత్రణకు సహకరించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. నేటి నుండి మాస్క్ ధరించని యెడల గ్రామ పరిధిలో రూ.50/-, పట్టణ పరిధిలో రూ.100/- జరిమానా విధించబడునని, దీనితో పాటు బహిరంగ ప్రదేశాలలో ఉమ్మి

వేయడం కూడా నిషేధించడమైనదని, అట్లు ఉమ్మి వేసిన వారి పై చట్ట రీత్యా చర్యలు తీసుకోబడునని తెలిపారు. ఆదేశాలను అతిక్రమించిన వారి పై ఐపిసి సెక్షన్ 188 విపత్తుల నిర్వహణ చట్టం – 2005 నిబంధనల మేరకు శిక్షార్హులని వారి పై చర్యలు తీసుకోబడునని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.


368 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon