• Neti Charithra

ములకలచెర్వు లో కలెక్టర్. ఎస్పీ మకాం... పోలీసులకు కీలక ఆదేశాలు జారీ !


ములకలచెర్వు లో కలెక్టర్.. ఎస్పీ మకాం... పోలీసులకు.. కీలక ఆదేశాలు జారీ !



ములకలచెర్వు: నేటి చరిత్ర


చిత్తూరు జిల్లా ములకలచెరువు ను కలెక్టర్ డాక్టర్ భరత్ గుప్తా, ఎస్పీ సెంథిల్ కుమార్ లు సందర్శించారు. ఈ సందర్భంగా చిత్తూరుజిల్లా - అనంతపురం జిల్లా సరిహద్దు లోని ములకలచెర్వు మండలం లో లాక్ డౌన్

అమలుతీరును పరిశీలించారు. అనంతపురం జిల్లా నుంచి చిత్తూరుజిల్లా లో కి అనుమతి లేకుండా ఎవ్వరిని అనుమతించ రాదని ఆదేశించారు.

ముఖ్యంగా ములకలచెర్వు మండల పరిసరాల నుంచి కోయం బేడుకు వెళ్లి వచ్జిన డ్రైవర్ లు, క్లినర్ లు, రైతులను గుర్తించి వారికి వైద్య పరీక్షలు చేయించాలన్నారు.

ములకలచెర్వు ను రెడ్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో అవసరం అయితే వలంటీర్లు ద్వారా నిత్యవసర సరుకులు ను ఇంటింటికి పంపిణీ చేయించే ప్రక్రియ చేపట్టి పరిస్థితి అదుపు లోకి వచ్చే వరకు పర్య వేక్షణ కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పి రవి మనోహరాచారి సీఐ సురేష్ కుమార్ తాసిల్దార్ మహేశ్వరి బాయ్ ఎంపీడీవో రమేష్ బాబు డాక్టర్ భావన పాల్గొన్నారు

870 views
Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon