• Neti Charithra

మానవ మృగాల గుండెలు.. చీల్చిన.. బుల్లెట్లు..మా కివ్వండి! - సినీ ప్రముఖులు

#మానవ మృగాల గుండెలు.. చీల్చిన.. బుల్లెట్లు..మా కివ్వండి!

హైదరాబాదు: నేటి చరిత్ర (డిసెంబర్6) దేశవ్యాప్తంగా కుదిపేసిన దిశ.. దారుణ ఘటన నిందితులు అయిన నలుగురు మానవ మృగాలు పోలీస్ బుల్లెట్లకు.. మట్టిలో.. కలిసాయని.. పలువురు ప్రముఖులు.. పేర్కొన్నారు. ఆ.. నలుగురు మానవ మృగాల గుండెలను .. చీల్చిన.. తుపాకీ బుల్లెట్ లు ను తాము.. దాచుకోవలను కుంటున్నామంటూ.. ప్రముఖ నటులు ప్రకటించిన వైనం.. తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి.. కలిగిస్తోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున, మంచు...నాని, రకుల్ ప్రీతి వంటి వారు.. ఎంకౌంటర్.. సరైన శిక్ష అంటూ.. ట్వీట్ లు చేశారు.

శంషాబాద్‌లో వెటర్నరీ వైద్యురాలు ‘దిశ’ హత్యోదంతానికి పోలీసులు ముగింపు పలికారు. కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్‌ ఆరిఫ్‌ పాషా, జొల్లు శివ, నవీన్‌, చెన్న కేశవులను శుక్రవారం తెల్లవారుజామున ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ నేపథ్యంలో అటు ప్రజల నుంచి ఇటు సినీ ప్రముఖుల నుంచి హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసులు చేసిన పనిపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. #Encounter #JusticeForDisha హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. ‘‘న్యాయం జరిగింది.. ఇప్పుడు దిశ ఆత్మకు శాంతి కలుగుతుంది’’ - ఎన్టీఆర్‌ ‘‘నిద్ర లేవడంతోనే ఒక వార్త విన్నా. న్యాయం బతికే ఉంది’’ - అక్కినేని నాగార్జున ‘‘మా టీజర్స్‌, ట్రైలర్లు లైక్‌ చేయకపోయినా పర్వాలేదు. దయ చేసి ఈ ఎన్‌కౌంట్‌ న్యూస్‌ ట్రెండింగ్‌ చేయండి. ఇలా జరిగింది అని చాటింపు వేయండి’’ - దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ‘‘ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి. వాడు పోలీసోడు అయి ఉండాలి’’ - నాని ‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది’ ‘‘అత్యాచార నేరం చేసిన తర్వాత ఎంత దూరం పారిపోతారు. థ్యాంక్యూ తెలంగాణ పోలీస్‌’’ - రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ‘‘అమానవీయ ఘటనకు పాల్పడిన మృగాళ్లకు చివరకు సరైన శిక్ష పడింది. దిశను మళ్లీ తీసుకురాలేం. కానీ, అత్యాచారం, హత్య చేయాలని ఆలోచన వచ్చిన వాళ్లకు ఈ పరిణామాలు గుర్తుకు రావాలి’’ - నిఖిల్‌ ‘‘ఆ బుల్లెట్లు దాచుకోవాలని ఉంది. ఆ తుపాకులకు దండం పెట్టాలని ఉంది. ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది. నలుగురు చచ్చారు.. అనే వార్తలో ఇంత కిక్కు ఉందా? ఈ రోజే ఆత్మ దేవుణ్ని చేరింది చెల్లెమ్మా’’ - మంచు మనోజ్‌ ‘‘ఒకప్పుడు మరణదండనకు నేను వ్యతిరేకంగా మాట్లాడేదాన్ని. కానీ, కొన్ని సంవత్సరాలుగా నా అభిప్రాయాన్ని మార్చుకున్నా. అత్యాచారాలకు పాల్పడే వారిని తప్పకుండా ఉరి తీయాలి. మహిళలకు మన దేశం ఎలాంటి గౌరవం ఇస్తుందో అనే దానికి ఉదాహరణగా నిలిచినందుకు థ్యాంక్యూ కేసీఆర్‌గారు.’’ - మంచు లక్ష్మి.

Please Note
Join our mailing list
  • Black Facebook Icon
  • Black YouTube Icon